నిన్న ఢిల్లీలో.. ఇవాళ అస్సాంలో.. వ‌ర‌స భూప్ర‌కంప‌న‌లు

నిన్న ఢిల్లీలో.. ఇవాళ అస్సాంలో.. వ‌ర‌స భూప్ర‌కంప‌న‌లు

అస్సాంలోని సోనిత్‌పూర్‌లో మే 29న ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8.03 గంటలకు 15 కిలోమీటర్ల లోతుతో భూకంపం సంభవించింది. ఇటీవలే బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు సంభవించగా.. ఇప్పుడు అస్సాంలోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.

గౌహతిలో 24 గంటల్లోనే రెండోసారి భూకంప ప్రకంపనలు సంభవించాయి. మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో మే 28న మధ్యాహ్నం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2.58 గంటలకు 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. అంతకుముందు, సాయంత్రం 6:26 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఉదయం 11:20 గంటలకు సంభవించాయని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.

https://twitter.com/NCS_Earthquake/status/1663014518627401728