ఢిల్లీలో స్వల్ప భూకంపం..నాలుగురోజుల్లోనే రెండోసారి

ఢిల్లీలో స్వల్ప భూకంపం..నాలుగురోజుల్లోనే రెండోసారి

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో భూమి 5 సెకన్లపాటు కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. నేపాల్లో సంభవించిన భూకంపం ధాటికి ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 7.57 గంటలకు నేపాల్లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ఉత్తరాఖండ్లోని జోసీమత్ కు ఆగ్నేయంగా 212 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. ఈ ప్రభావంతో ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్, మున్సియరీ, గంగోలీహాట్ సహా పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి.

ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలోనూ ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదైంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్ గావ్  ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్లీ భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.