స్టోక్స్‌‌‌‌, అట్కిన్సన్ పై ఈసీబీ వేటు

స్టోక్స్‌‌‌‌, అట్కిన్సన్ పై ఈసీబీ వేటు

లండన్‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌‌‌‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. నైట్‌‌‌‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌‌‌‌లపై ఈసీబీ వేటు వేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుండటంతో బుధవారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వీరికి చోటు దక్కలేదు. 

స్టోక్స్ స్థానంలో సీనియర్ బ్యాటర్ జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌‌‌‌గా జట్టును నడిపించనున్నాడు. స్టోక్స్‌‌‌‌, అట్కిన్సన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో జోఫ్రా ఆర్చర్‌‌‌‌, జోర్డాన్‌‌‌‌ కాక్స్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నెల 17 నుండి 21 వరకు ఓవల్‌‌‌‌లో  రెండో టెస్టు జరగనుంది.