ఈసీఐఎల్​ టు అరుణాచలం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ఈసీఐఎల్​ టు అరుణాచలం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

మల్కాజిగిరి, వెలుగు : అరుణాచల గిరి పద్రక్షిణం కోసం ఈసీఐఎల్​నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 15న గురుపౌర్ణమి ఉండగా, 13న సాయంత్రం 7 గంటలకు ఈసీఐఎల్​నుంచి బస్సు బయలు దేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.