తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈడిగ ఆంజనేయగౌడ్

 తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈడిగ ఆంజనేయగౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఈడిగ ఆంజనేయగౌడ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ  మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన నియామకపత్రాన్ని ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం   కేసీఆర్ కు  ఆంజనేయగౌడ్ కృతజ్జతలు తెలిపారు.

ఈడిగ ఆంజనేయ గౌడ్ విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓయూలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో  టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.