ప్రతి ఇంట్లోనూ టాలెంట్ ఉంది

ప్రతి ఇంట్లోనూ టాలెంట్ ఉంది

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌‌లో విద్యారంగ అభివృద్ధికి కావాల్సిన కేటాయింపులు చేశామన్నారు. విద్య, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్‌‌ నిర్మాణంలో యువత తమపై తాము ఆధారపడేలా చేయడం కీలకం. యువత బాగా చదువుకొని, స్కిల్స్‌‌ను మెరుగుపర్చుకొని నాలెడ్జ్‌‌తో ఉండటం ముఖ్యం. దేశంలోని ప్రతి ఇంట్లో నైపుణ్యం కలిగిన వారున్నారు. కొత్త విద్యా విధానంలో భారతీయ భాషలను ప్రోత్సహించాలి. ప్రపంచంలోని బెస్ట్ కంటెంట్‌‌ను భారతీయ భాషల్లోకి ఎలా తీసుకురావాలన్నది భాషా నిపుణుల బాధ్యత. మన దేశంలో హైడ్రోజన్ వెహికల్‌ను టెస్ట్ చేశాం. ఇప్పుడు రవాణా కోసం చమురు స్థానంలో హైడ్రోజన్‌ను ఇంధనంగా ఎలా వినియోగించాలో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది’ అని మోడీ పేర్కొన్నారు.