V6 News

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.52 లక్షలు

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.52 లక్షలు

పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానం హుండీని గురువారం లెక్కించారు. ఆలయ ఈవో మఠం వీరేశం, ఎండోమెంట్ మెదక్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ రంగారావు, మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, శ్రీవెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 56 రోజుల కాలానికి హుండీ ద్వారా రూ.52,12,171 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. మిశ్రమ బంగారం 0.024 గ్రాములు, మిశ్రమ వెండి 0.927 గ్రాములు సమకూరినట్లు వెల్లడించారు