తెలుగులో లస్ట్ స్టోరీ కన్ఫామ్..హీరోయిన్స్ ఎవరంటే..!?

తెలుగులో లస్ట్ స్టోరీ కన్ఫామ్..హీరోయిన్స్ ఎవరంటే..!?

తెలుగులో లస్ట్ స్టోరీ వెబ్ సిరీస్ కన్ఫామ్ అయ్యింది. లస్ట్ స్టోరీస్. హిందీలో బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ “ లస్ట్ స్టోరీస్”  వెబ్ సిరీస్ ను నిర్మించింది. కంప్లీట్ అడల్ట్ కంటెంట్ తో ఈ వెబ్ సిరీస్ కు హిందీలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ నిర్మాత రోనీ స్కూవాలా టాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డిలు నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై స్పందించిన నందిని రెడ్డి తాము హిందీ లస్ట్ స్టోరీస్ ను తెలుగులో రీమేక్ చేయడం లేదని చెప్పుకొచ్చింది. ఫ్రెష్ కంటెంట్ తో వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పింది.