చనిపోయిన బంధువు అస్థికలు గంగలో కలిపేందుకు వెళ్తూ.. పంజాబ్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

చనిపోయిన బంధువు అస్థికలు గంగలో కలిపేందుకు వెళ్తూ.. పంజాబ్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

వారంతా బంధువులు.. ఓ బంధువు చనిపోతే  అస్థికలు గంగలో కలిపేందుకు అంతా కలిసి వెళ్తున్నారు. చనిపోయిన బంధువు ఆత్మకు శాంతి కలిగించాలని వెళ్తున్న వారికి ఊహించని ప్రమాదం ఎదురైంది.. ట్రక్కు రూపంలో మృత్యువు వెంటాడింది. బంధువుల్లో కొందరిని దూరం చేసింది. శనివారం(జూన్6) ఉదయం పంజాబ్ లోని ఫిరోజ్ పూర్-ఫాజిల్కా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది  స్పాట్ లోనే చనిపోయారు. 

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజ్ పూర్ , ఫాజిల్కా హైవేపై జంగవాలా సమీపంలో శనివారం ఉదయం రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.  

25 మంది ప్రయాణికులతో వెళ్తున్న మహీంద్రా పికప్ వాహనం, మరో ట్రక్కును ఎదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పికప్ వెహికల్ లోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ చనిపోయారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బంధువు చనిపోతే అస్థికలను నిమజ్జనం చేసేందుకు జలాలాబాద్ నుంచి బియాన్ లోని రాధా సోమీ డేరాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయినవారు, గాయపడ్డవారు అంతా బంధువులే కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.