72 గంటలు సిద్దూపై బ్యాన్..సాధ్విపై ఎఫ్ఐఆర్

72 గంటలు సిద్దూపై బ్యాన్..సాధ్విపై ఎఫ్ఐఆర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఈసీ వేటు పడింది. 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 10గంటల నుంచి ఈ బ్యాన్ అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ నెల 6న బీహార్ లో ఎన్నికల ప్రచారంచేస్తూ సిద్ధూ .. ముస్లిం ఓటర్లంతా కలిసి మోడీని ఓడించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ కామెంట్స్​పై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈసీ విచారణ జరిపింది. మతపరమైన కామెంట్స్​ చేసినందుకు సిద్ధూపై బ్యాన్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చి వేతఘటనపై వివాదాస్పద కామెంట్స్​ చేసినందుకు సాధ్విపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈసీ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఓ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాధ్వి మాట్లాడుతూ.. బాబ్రీమసీదు కూల్చి వేతలో పాల్గొ నడం తనకు గర్వకారణం అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.