జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
  • 19న నామినేషన్లు, 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
  • ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ చేసిన బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆ పార్టీ.. ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ జాతీయ రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ అధికారి, ఎంపీ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ను అధికారికంగా ప్రకటించారు. ‘సంఘటన్‌‌‌‌‌‌‌‌ పర్వ్‌‌‌‌‌‌‌‌–2024’లో భాగంగా ఈ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఢిల్లీ దీన్‌‌‌‌‌‌‌‌దయాల్‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌ లోని పార్టీ హెడ్ ఆఫీస్ లో ఈ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఈ నెల 16న మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల మండలి జాబితా విడుదల అవుతుందన్నారు. 

19న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్‌‌‌‌‌‌‌‌ పత్రాల పరిశీలన.. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. సాయంత్రం 6.30 గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను జాతీయ ఎన్నికల అధికారి విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 20న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఓటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి.. అదే రోజు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించడం లేదా అసరమైతే ఓటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తామని ఎన్నిక షెడ్యూల్ లో స్పష్టం చేశారు.