అసిస్టెడ్​ డ్రైవ్​ టెక్నాలజీ, కీలెస్​ ప్రత్యేకతలతో ఓలా కారు

అసిస్టెడ్​ డ్రైవ్​ టెక్నాలజీ, కీలెస్​ ప్రత్యేకతలతో ఓలా కారు

న్యూఢిల్లీ: ఇది వరకే ఎలక్ట్రిక్​ స్కూటర్లు అమ్ముతున్న ఓలా ఎలక్ట్రిక్​ కారును కూడా తెస్తోంది. దీనిని ‘మిషన్​ ఎలక్ట్రిక్​ 2022’ ఈవెంట్​లో లాంచ్​ చేసింది. కంపెనీ సీఈఓ భవీశ్​ అగర్వాల్​ కారు ప్రత్యేకతలను వివరించారు. ఎన్నో స్పెషల్​ ఫీచర్లు, డిజైన్​ దీని సొంతమని ప్రకటించారు. ఓలా కారు చాలా స్పోర్టీగా ఉంటుందని, పైకప్పును పూర్తిగా గ్లాస్​తో తయారు చేస్తామని వెల్లడించారు. అసిస్టెడ్​ డ్రైవ్​ టెక్నాలజీ, కీలెస్​ వంటి ప్రత్యేకతలు ఉంటాయని సీఈఓ అన్నారు. ఈ కారుకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీని ఒక్కసారి చార్జ్​ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది 2024లో కస్టమర్ల ముందుకు వస్తుంది. ప్రస్తుతం డెవెలప్​మెంట్ స్టేజీలోనే ఉన్నందున తేదీ, నెల తదితర వివరాలను కంపెనీ ప్రకటించలేదు. మనదేశంలో ప్రస్తుతం హుండై కోనా, టాటా టిగోర్​, టాటా నెక్సాన్​ ఈవీ, వోల్వో ఎక్స్​సీ40 రీచార్జ్​, ఎంజీ జెడ్ఎస్​ ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. 

కొత్త ఈ‌‌‌‌‌‌‌‌–స్కూటర్​ ఎస్​1

ఓలా ‘ఎస్​1’ పేరుతో  ఈ సందర్భంగా రూ.99,999 ప్రారంభ ధరతో  మరొక కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేసింది​. ఇది ఆగస్టు 15–-31 మధ్య రూ.499 చెల్లించి దీనిని బుక్​ చేసుకోవచ్చు.  డెలివరీలు సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమవుతాయి.  పర్చేజ్​ విండో సెప్టెంబరు 1న ఓపెన్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్​1 పోయిన సంవత్సరం ప్రారంభించిన ఎస్​1 ప్రోకి తక్కువ ధర వెర్షన్​.  ఎస్​1 ప్రో మాదిరిగానే, ఇందులో మూవ్​ ఓఎస్​ సహా అన్ని సాఫ్ట్‌‌‌‌వేర్లు అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ అవుతాయి. ఈ కొత్త బండి 13 కిలోవాట్​ అవర్​ ఎలక్ట్రిక్  మోటారుతో  వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌‌‌‌ చేస్తే 131 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది మూడు  రైడింగ్ మోడ్‌‌‌‌లతో వస్తుంది. ఎకో మోడ్ అయితే 128 కిలోమీటర్లు వెళ్తుంది. సాధారణ మోడ్ 101 కిలోమీటర్ల మైలేజ్​ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్​లో  స్కూటర్‌‌‌‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ మైలేజ్​ మాత్రమే ఇస్తుంది. ఇది గంటకు 90 కి.మీ.ల వేగంతో పరుగెత్తుతుంది. ఓలా ఎస్​1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కేవలం ఏడు నెలల్లో 70 వేల ఎస్​1 ప్రొ యూనిట్లు అమ్ముడయ్యాయని ఓలా సీఈవో పేర్కొన్నారు. కొత్త ఓలా స్కూటర్‌‌‌‌ను తమిళనాడులోని ఫ్యాక్టరీలో నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే ఓలా తన ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రోలో ఖాకీ కలర్ వేరియంట్‌‌‌‌ను కూడా పరిచయం చేసింది.  ప్రస్తుతం మార్ష్‌‌‌‌మెల్లో, నియో మింట్, పోర్సిలిన్​ వైట్, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, మాట్ బ్లాక్, ఆంత్రాసైట్ గ్రే  గెరువా కలర్ ఆప్షన్‌‌‌‌లలో అందుబాటులో ఉంది.

 ఇండియాలోని అత్యంత ఫాస్టెస్ట్​ కార్లలో ఓలా ఒకటి

కొత్త ఇండియాను చూపెట్టే కారు మనకు ఇప్పుడు కావాలి. మన కొత్త దేశం నిర్భయంగా ఉంటుంది.  తన ఫ్యూచర్​ను తనే రాసుకుంటుంది. ఇండియాలోని అత్యంత ఫాస్టెస్ట్​ కార్లలో ఓలా ఒకటి అవుతుంది. కేవలం నాలుగు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మూవ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​తో నడుస్తుంది. అసిస్టెట్​ డ్రైవింగ్​ సదుపాయాలు ఉం టాయి. కీలెస్​, హాండిల్​లెస్​ ఫీచర్లు కూడా ఉంటాయి.

- భవీశ్​ అగర్వాల్​, ఓలా సీఈఓ