రామాయంపేట మండలంలో ఇందిరమ్మ ఇంటి మధ్యనే కరెంట్‌‌‌‌ పోల్‌‌‌‌

రామాయంపేట మండలంలో ఇందిరమ్మ ఇంటి మధ్యనే కరెంట్‌‌‌‌ పోల్‌‌‌‌

రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో కట్ట రామచంద్రానికి ఖాళీ స్థలం ఉండగా అందులో కరెంట్‌‌‌‌ పోల్ ఉంది. దానిని తొలగించమని అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. కాగా అతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఏకంగా అదే స్థలంలో మధ్యలోనే పోల్‌‌‌‌ను ఉంచి ఇల్లు నిర్మించాడు. 

దీనిపై ఏఈ గణేశ్‌‌‌‌ను వివరణ కోరగా కరెంట్ పోల్ మార్చమని తమ దృష్టికి వచ్చిందని, అయితే నిబంధనల ప్రకారం పోల్​తొలగించేందుకు ఎస్టిమేషన్ డీడీ రూ.11వేలు సూచించామన్నారు. కానీ వాళ్లు డీడీ కట్టకపోవడంతో కరెంట్‌‌‌‌ పోల్ మార్చలేకపోయామన్నారు.