కంపెనీ ఖర్చులు తగ్గించడంపై ఎలన్ మస్క్ ఫోకస్‌‌

కంపెనీ ఖర్చులు తగ్గించడంపై ఎలన్ మస్క్  ఫోకస్‌‌

న్యూఢిల్లీ: ట్వీట్లను మానిటైజ్ (డబ్బుల రాబట్టడానికి) చేయడానికి కొత్త విధానాలను కనుగొంటానని, ఖర్చులు తగ్గిస్తానని బ్యాంకులకు ఎలన్ మస్క్ చెప్పినట్టు ఓ రిపోర్ట్ పేర్కొంది. ట్విటర్‌‌‌‌ను కొనుగోలు చేయడానికి 44 బిలియన్ డాలర్లను మస్క్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కంపెనీ క్యాష్‌‌ ఫ్లోస్‌‌ను బట్టి బ్యాంకులు అప్పులిస్తాయి. దీంతో బ్యాంకులను ఒప్పించడానికి మస్క్ ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు.  ట్విటర్‌‌‌‌ను కొనేందుకు 13 బిలియన్ డాలర్లను  బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవాలని మస్క్ చూస్తున్నారు. మరో 12.5 బిలియన్ డాలర్లను టెస్లా షేర్లను తనాఖా పెట్టి అప్పు చేయనున్నారు. మిగిలిన అమౌంట్‌‌ను తన దగ్గర ఉన్న డబ్బుల నుంచి ఏర్పాటు చేయనున్నారు.  ట్విటర్ కొన్నాక కంపెనీ ఖర్చులు ఎలా తగ్గిస్తారో  మస్క్‌‌ డిటైల్‌‌గా వివరించలేదని సంబంధిత వ్యక్తులు అన్నారు. కాగా, ట్విటర్ బోర్డు డైరెక్టర్ల శాలరీలను కట్ చేస్తే 3 మిలియన్ డాలర్లను పొదుపు చేయొచ్చని మస్క్ ట్వీట్ చేయడం గమనించాలి. మెటా, పింట్రెస్ట్ వంటి పోటీ కంపెనీలతో పోలిస్తే ట్విటర్ గ్రాస్‌‌ మార్జిన్‌‌ చాలా తక్కువని, ట్విటర్‌‌‌‌ను తక్కువ ఖర్చులోనే నడపడానికి వీలుంటుందని మస్క్ వివరించారు.   కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసేసే ఆలోచన కూడా మస్క్‌‌కు ఉందని బ్లూమ్‌‌బర్గ్‌‌ న్యూస్‌‌ రిపోర్ట్ చేసింది.