స్విగ్గీ ఐపీఓకి గ్రీన్ సిగ్నల్‌‌‌‌ .. రూ.10,400 కోట్లు సేకరించేందుకు బోర్డు ఆమోదం

 స్విగ్గీ ఐపీఓకి గ్రీన్ సిగ్నల్‌‌‌‌ .. రూ.10,400 కోట్లు సేకరించేందుకు బోర్డు ఆమోదం

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ స్విగ్గీ  ఐపీఓ ద్వారా రూ.10,400 కోట్ల సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.  ఫ్రెష్‌‌‌‌‌‌‌‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా, ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను సేకరించనున్నారు. తాజాగా జరిగిన ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీ జనరల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ (ఈజీఎం) లో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఫ్రెష్‌‌‌‌‌‌‌‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా  రూ.3,750 కోట్లను సేకరించాలని స్విగ్గీ చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. 

 షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్లు మరో రూ.6,664 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారని తెలిపారు. ఐపీఓకి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లు సేకరించే ఆలోచనలో స్విగ్గీ ఉంది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 10 నాటికి ఈ కంపెనీ వాల్యుయేషన్ 12.7 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల దగ్గర ఉంది. కిందటేడాది మార్చి 31 నాటికి కంపెనీ యాన్యువల్ రెవెన్యూ  సుమారు రూ.8,400 కోట్లుగా రికార్డయ్యింది. ఈ కంపెనీలో 4,700 మంది ఉద్యోగులు  పనిచేస్తున్నారు. స్విగ్గీ  ప్రత్యర్ధి కంపెనీ జొమాటో ఇప్పటికే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు గురువారం రూ. 184 దగ్గర క్లోజయ్యాయి.