ఊసరవెల్లి రంగుల రహస్యం

ఊసరవెల్లి రంగుల రహస్యం

ప్రకృతిలో ఎన్నో రకాల రంగులతో అందమైన పక్షులు,  జంతువులు, పువ్వులు ఉన్నాయి. కానీ, వాటన్నింటి కంటే ప్రత్యేకమైనది ఊసరవెల్లి. పైన చెప్పినవన్నీ ఒకటో, రెండో రంగుల్లో ఉంటే.. ఊసరవెల్లి మాత్రం ఇంద్రధనుస్సులో లేని రంగుల్ని కూడా దాని ఒంటి మీద చూపిస్తుంది. ఆకారం అందంగా లేకపోయినా, అది మార్చే రంగుల్ని చూస్తే ముచ్చటేస్తుంది. మరి దాని రంగుల వెనకున్న రహస్యమేంటో తెలుసా?

శత్రువు కంట పడకూడదని ఉన్న ప్లేస్​ని బట్టి ఊసరవెల్లి రంగులు మారుస్తుంది అనుకుంటారు. కానీ అది మాత్రమే నిజం కాదు. మరెందుకు ఆకుల్లో ఆకుపచ్చ, నేల మీద మట్టి రంగు.. ఏ ప్లేస్​లో ఉంటే ఆ రంగులో మారుతుంది? అంటారా.. దాని వెనక ఉన్న కారణాలు.. ఎమోషన్, బాడీ టెంపరేచర్, ఎన్విరాన్​మెంట్​. ఈ కారణాల వల్ల మాత్రమే ఊసరవెల్లి రంగులు మారుతుంది. అదెలాగంటే... ఎమోషన్​ మారినప్పుడు ఊసరవెల్లి రంగు మారుతుంది. ఉదాహరణకు ఊసరవెల్లి గ్రీన్ కలర్​లో ఉందంటే అది ప్రశాంతంగా ఉందని అర్థం. టెన్షన్​, భయంలో ఉంటే ఎరుపు లేదా బ్రౌన్​ కలర్​లోకి మారుతుంది. కాకపోతే నిజానికి అది మార్చదు. దానికి తెలియకుండానే చర్మం రంగులు మారిపోతూ ఉంటుంది. 

మామూలుగా బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ‘నలుపు రంగుల బట్టలు వేసుకోవద్దు. లైట్ కలర్స్ వేసుకోవాలి. బ్లాక్ కలర్ డ్రెస్​లు వేడి తీవ్రతని ఎక్కువ చేస్తాయి’ అంటుంటారు. ఈ విషయంలో ఊసరవెల్లిది కూడా మన​ ఫార్ములానే. దాని శరీరానికి వేడి అవసరం అయినప్పుడు నలుపు రంగులోకి.. చల్లదనం కావాలనుకున్నప్పుడు లైట్​ కలర్స్​లోకి మారుతుంది. నలుపు రంగు సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహిస్తే, లైట్​ కలర్స్ సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తాయి. దాంతో బాడీ టెంపరేచర్​ కంట్రోల్​ అవుతుంది. ఇదన్నమాట అసలు విషయం. 

రంగుల వెనక రహస్యం

ఊసరవెల్లి చర్మంలో మూడు పొరలు ఉంటాయి. మొదటి పొర ఎపిడెర్మిస్. ఇందులో ఎరుపు, పసుపు పిగ్మెంట్స్ ఉంటాయి. రెండోది మెలనోఫోర్. ఈ పొర నలుపు, బ్రౌన్ రంగుల్ని చూపిస్తుంది. తర్వాతి పొర నెథర్. తెలుపు రంగులో ఉండి రంగుల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేగాక ఈ పొరలో130 నానో మీటర్ల సైజులో ఉండే క్రిస్టల్స్ ఉంటాయి. అంటే.. ఒక వెంట్రుకలో వందో వంతు అన్నమాట. సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలో నుంచి కొన్ని రంగుల్ని ఈ క్రిస్టల్స్ గ్రహిస్తాయి. వాటిలో కొన్నింటిని చర్మం రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఊసరవెల్లి ఎమోషన్​ని బట్టి దగ్గరగా, దూరంగా జరుగుతుంటాయి. క్రిస్టల్స్ దగ్గరగా ఉన్నప్పుడు సన్​లైట్​ నుంచి అన్ని రంగుల్ని గ్రహించి, కేవలం బ్లూ కలర్​ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది స్కిన్. ఆ టైంలో కొన్నిసార్లు బ్లూ కలర్​తోపాటు పై పొరలో ఉన్న పసుపు రంగు పిగ్మెంట్ కూడా కలిసిపోతుంది. దాంతో బయటికి గ్రీన్​ కలర్​ కనిపిస్తుంది. ఇవే కాదు.. ఇవి రంగులు మారడానికి మరో కారణం ఉంది. అదేంటంటే.. మగ ఊసరవెల్లులు ఆడవాటిని చూసినప్పుడు కూడా రంగులు మారతాయి. అంతేకాదు ఆ రంగులు చాలా బ్రైట్​గా ఉంటాయి​. ఇలా వాటినే కాకుండా రంగుల సొగసుతో మనుషుల్ని కూడా మెస్మరైజ్ చేస్తోంది. ఏదేమైనప్పటికీ దాని అందం వెనక ఉన్న రహస్యాలు మాత్రం ఇవే.

స్పెషాలిటీస్ ఎన్నో

సాధారణంగా మనం తినే ఫుడ్​ వల్ల కొన్నిసార్లు వేడి చేస్తుంటుంది. అంటే ఒంట్లో ఉష్ణోగ్రతలు మారతాయి. అలానే ఊసరవెల్లికి కూడా అది తినే ఫుడ్​ వల్ల దాని బాడీలో టెంపరేచర్​ మారుతుంటుంది. టెంపరేచర్ మారిందంటే రంగు మారాల్సిందే.ఊసరవెల్లి తలపై ఉండే టోపీలాంటి ఆకారాన్ని కాస్క్ అంటారు. రాత్రిపూట అది నీటి బిందువుల్ని నోట్లోకి పంపిస్తుంది. ఊసరవెల్లి రెండు కళ్లతో రెండు దిశలను చూడగలదు. పైగా 360 డిగ్రీల్లోనూ చూడగలదు. ఊసరవెల్లి చెవుల కోసం రంధ్రాలు ఉండవు. అయినా వీటికి శబ్దాలు వినిపిస్తాయి. ఆడ ఊసరవెల్లి ఏడాదికి మూడుసార్లు గుడ్లు పెడుతుంది. ప్రతిసారి 20 నుంచి 70 గుడ్లు పెడుతుంది. 6–9 నెలల మధ్యలో పొదుగుతుంది. అప్పటివరకు వాటిని గుంతలో పూడ్చి పెడుతుంది.ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే రెండు రెట్లు పొడవు ఉంటుంది. చాలా వేగంగా కదులుతుంది. గంటకు దాదాపు 60 మైళ్ల వేగంతో నాలుకను విసరగలదు. అంటే దాదాపు స్పోర్ట్స్​కారు వేగం అన్నమాట.