
హైదరాబాద్, వెలుగు : జోగుళాంబ గద్వాల జిల్లా కోడూరుకి చెందిన నగేశ్(25), సుకన్య దంపతులు కొన్నాళ్ల కిందట జల్పల్లి మున్సి పాలిటీ పరిధి శ్రీరామ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. లక్ష్మిగూడలోని ఓ వ్యక్తి వద్ద నగేశ్ జాబ్ చేస్తుండగా మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. లక్మిగూడలోని గెస్ట్హౌస్ వద్ద చింత చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.