జార్ఖండ్లో ఎన్ కౌంటర్.. 15 మంది నక్సల్స్ మృతి.. కీలక నేతలు మరణించినట్టు ప్రచారం

జార్ఖండ్లో ఎన్ కౌంటర్.. 15 మంది నక్సల్స్ మృతి.. కీలక నేతలు మరణించినట్టు ప్రచారం
  • కొనసాగుతున్న ఎదురు కాల్పులు
  • వెస్ట్ సింగ్బహమ్ జిల్లా సారాండా అడవుల్లో ఘటన

రాంచీ: జార్ఖండ్లోని వెస్ట్ సింగ్ బహ మ్ జిల్లా సారాండా అడవుల్లో గురువారం (జనవరి 22) ఉదయం భద్రతా బలగాలు, 209 మంది సభ్యుల కోబ్రా బెటాలియన్ కు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 15 మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. మావోయిస్టులున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతాబలగాలు కూంబింగ్ చేపట్టా యి. 

అదే సమయంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం. కొండలు ఉండటంతో ఇంకా కాల్పులు కొనసా గుతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

 

 దట్టమైన అటవీ ప్రాంతం లోకి మావోయిస్టులు పారిపోయిన ట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల్లో ఎవరున్నారనేది తెలియడం లేదు. అయితే కీలక నేతలు మరణించి నట్టు ప్రచారం జరుగుతోంది.