విజయవాడ హైవేపై ఆక్రమణల తొలగింపు

విజయవాడ హైవేపై ఆక్రమణల తొలగింపు

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండల కేంద్రంలో విజయవాడ హైవేపై ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా వాహనదారులకు అంతరాయం కలిగే విధంగా అక్రమ నిర్మాణాలు చేయడంతో మెట్​చౌరస్తాలో ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో శనివారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. 

విజయవాడ హైవే ట్రాఫిక్ సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గత వారం రివ్యూ నిర్వహించిన అధికారులు తాత్కాలికంగా ట్రాఫిక్ ఉపశమనం కోసం ఈ చర్య తీసుకున్నారు. అయితే ఇక్కడ రోడ్డు వెడల్పు చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.