ఈవీలకు ఎనర్జీ బూస్ట్‌..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర వ్యాప్తంగా 369 చార్జింగ్ స్టేషన్లు

ఈవీలకు ఎనర్జీ బూస్ట్‌..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర వ్యాప్తంగా 369 చార్జింగ్ స్టేషన్లు
  • యూనిట్​కు రూ. 13 చొప్పున చార్జీ
  • ప్రైవేటుకు పదేండ్ల పాటు కాంట్రాక్ట్
  • హైదరాబాద్ సిటీలో 200 పాయింట్స్
  • ఎన్​పీడీసీఎల్ పరిధిలో 169 స్టేషన్స్
  • 22 వరకు టీజీ రెడ్కో టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రెన్యూవెబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టీజీ రెడ్కో) రెడీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 369 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. హైదరాబాద్​ మెగా సిటీ పరిధిలో 200, నార్తర్న్​ డిస్కమ్​ పరిధిలో 169 ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.13 చార్జింగ్​ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పదేండ్లపాటు కాంట్రాక్ట్​ ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రైవేట్​ రంగానికి భారీగా వ్యాపార అవకాశాలు రానున్నాయి. ఈ మేరకు సోమవారం టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ప్రీబిడ్​ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22తో టెండర్ల ప్రక్రియ ముగించనున్నట్టు ఆఫీసర్లు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లు.. 

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు టీజీ రెడ్కో  కీలక చర్యలు చేపట్టింది. దేశంలో ఈవీల వినియోగం వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది.  

ఈవీ రంగంలో రాష్ట్ర మార్కెట్ విస్తరిస్తుంది

భౌగోళికంగా రాష్ట్రానికి ఎంతో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. రాష్ట్రం మీదుగా అనేక జాతీయ రహదారులు, ప్రధాన రవాణా మార్గాలు విస్తరించి ఉండటంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణా గణనీయంగా జరుగుతున్నది. రాష్ట్ర ప్రజల జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులు, పట్టణీకరణ, వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్నది.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 369 ఈవీ చార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచినం.– ముషారఫ్​ ఫరూఖీ, వైస్​ చైర్మన్​ అండ్​ ఎండీ, టీజీ రెడ్కో సంస్థ, హైదరాబాద్​

ఈవీ చార్జింగ్ స్టేషన్ల విద్యుత్ వినియోగంపరంగా దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వాటికి తగ్గట్టుగా పబ్లిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ చార్జ్ పాయింట్ ఆపరేటర్లను (సీపీవోలను) ఆహ్వానిస్తూ టెండర్లను జారీ చేసింది.

హైదరాబాద్‌‌లో 200,నార్తర్న్ డిస్కం పరిధిలో 169 స్టేషన్లు

మెగా హైదరాబాద్ సిటీ పరిధిలోని జీహెచ్​ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌‌గిరి మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌  ప్రాంతాలను కవర్ చేస్తూ టీజీ రెడ్కో సంస్థ ఏర్పాటు చేసిన 200 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. నార్తర్న్​ డిస్కమ్​ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 169 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన సీపీవోలు సర్వే, డిజైన్, సరఫరా, సివిల్ వర్క్స్, ఇన్‌‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్‌‌తో పదేండ్లపాటు ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ‘పీఎం ఈ డ్రైవ్’ పథకంలో భాగంగా అర్హులైన బిడ్దర్‌‌‌‌కు నిబంధనలకు లోబడి సబ్సిడీ కూడా అందుతుంది.

 ప్రైవేట్ రంగానికి భారీ వ్యాపార అవకాశాలు

ఈవీ రంగంలో వ్యాపార అవకాశాలు వాహనాల తయారీ, విక్రయాలకే పరిమితం కాలేదు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్, అప్‌‌గ్రేడేషన్, ఈవీ ఫ్లీట్ ఆపరేషన్స్, సర్వీసింగ్, బ్యాటరీ సంబంధిత సేవలు, డిజిటల్ చార్జింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌లు, ఇతర అనుబంధ రంగాల్లోనూ విస్తృత అవకాశాలున్నాయి. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌‌ను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ రంగం ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా దీర్ఘకాలికంగా, వాణిజ్యపరంగా నిలకడైన ఈవీ ఎకో సిస్టమ్‌‌ను అభివృద్ధి చేయడమే టీజీ రెడ్కో లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. రెండు ప్రాజెక్టుల్లోనూ వినియోగదారుల కోసం ఈవీ చార్జింగ్ టారిఫ్‌‌ను యూనిట్‌‌కు రూ.13 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించారు. కాంట్రాక్ట్ కాలం మొత్తం ఇదే టారిఫ్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ ప్రాజెక్టులో చార్జర్లకు కనీసం 95 శాతం అప్‌‌టైమ్ ఉండేలా నిబంధనలు రూపొందించారు. అందుబాటు ధరలో చార్జింగ్ సదుపాయాన్ని అందించడంతోపాటు సీపీవోలకు దీర్ఘకాలికంగా స్థిరమైన వ్యాపార అవకాశాలు కల్పించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. 369 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ప్రాజెక్టుకు సంబంధించి ఫ్రీ బిడ్​ సమావేశాలను రెడ్కో ఆఫీసర్లు సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. బిడ్ల సమర్పణ ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభమై 22న ముగియనుంది. టెండర్లను తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌‌మెంట్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని రెడ్కో ఆఫీసర్లు తెలిపారు.