ఇంగ్లండ్‌‌ ఔట్‌‌.. టాప్‌‌ ప్లేస్‌‌కు ఇండియా

ఇంగ్లండ్‌‌ ఔట్‌‌.. టాప్‌‌ ప్లేస్‌‌కు ఇండియా

అహ్మదాబాద్‌‌: ఇంగ్లండ్‌‌పై పింక్‌‌బాల్‌‌ టెస్ట్‌‌లో భారీ విజయం సాధించిన టీమిండియా .. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌(డబ్ల్యూటీసీ) టేబుల్లో టాప్‌‌  ప్లేస్‌‌కు చేరింది. 71.0 పాయింట్స్‌‌ పర్సంటేజ్‌‌తో నంబర్‌‌వన్‌‌ స్థానంలో నిలిచింది.  న్యూజిలాండ్‌‌( 70 పీసీటీ) రెండో ప్లేస్‌‌కు చేరింది.  మరోపక్క డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ రేసు నుంచి ఇంగ్లండ్‌‌ తప్పుకుంది.అయితే, నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ప్రస్తుతం 2–1తో లీడ్‌‌లో ఉన్న ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ చేరాలంటే.. ఇంగ్లండ్‌‌తో జరిగే లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఓడిపోకూడదు. లాస్ట్‌‌ టెస్ట్‌‌లో గెలవకపోయినా కనీసం డ్రా చేసుకున్నా ఇండియా లార్డ్స్‌‌లో జరిగే మెగా ఫైనల్లో బరిలోకి దిగుతుంది. అలా కాకుండా లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ గెలిస్తే..69.2 పీసీటీతో డబ్ల్యూటీసీ టేబుల్లో ప్రస్తుతం థర్డ్‌‌ ప్లేస్‌‌లో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌‌కు అర్హత సాధిస్తుంది.