రిటైర్మెంట్ ఆలోచనలో ఇయాన్ మోర్గాన్?

రిటైర్మెంట్ ఆలోచనలో ఇయాన్ మోర్గాన్?

ఇంగ్లండ్  కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతార్జతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్టుగా బ్రిటిష్ మీడియా పేర్కొంది. గతకొంతకాలంగా పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న మోర్గాన్.. జులైలో టీంఇండియాతో వన్డే, టీ20 సిరీస్ ల తరువాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన రెండు వన్డేలో మోర్గాన్  డకౌట్ కాగా, గాయం కారణంగా మూడో వన్డేకు దూరమయ్యాడు.  ఐర్లాండ్‌తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన మోర్గాన్ ఇంగ్లండ్ తరఫున 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. మోర్గాన్ ఇప్పటి వరకు 248 వన్డేల్లో 39.29 సగటుతో 14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలతో 7,701 పరుగులు,115 టీ20ల్లో 2,458 పరుగులు చేశాడు.  16 టెస్టుల్లో 30.43 సగటుతో 700 పరుగులు చేశాడు.  2015 ప్రపంచ కప్‌కు ముందు అలిస్టర్ కుక్ నుండి కెప్టెన్సీ పగ్గాలను చేపట్టిన  మోర్గాన్ ..  126 వన్డేనలకు, 72 టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు.  ఇతని కెప్టెన్సీ లోనే ఇంగ్లండ్  వరల్డ్ కప్ గెలుచుకుంది. కాగా మోర్గాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే బట్లర్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది.