గడువు ముగిసినా టారిఫ్‌‌ సమర్పించని విద్యుత్ సంస్థలు

గడువు ముగిసినా టారిఫ్‌‌ సమర్పించని విద్యుత్ సంస్థలు
  • గడువులోగా టారిఫ్‌‌ ఇయ్యని డిస్కంలు

హైదరాబాద్‌‌, వెలుగు: కరెంటు చార్జీలపై ఈఆర్‌‌సీ ఇచ్చిన గడువు ముగిసినా విద్యుత్‌‌ సంస్థలు టారిఫ్‌‌ సమర్పించలేదు. కరెంటు ఆదాయ, అవసరాల ఏఆర్‌‌ఆర్‌‌ ప్రతిపాదనలను గత నవంబరు 30న విద్యుత్ సంస్థలు ఈఆర్‌‌సీకీ అందించాయి. కానీ టారిఫ్‌‌ ప్రకటించేదాకా చార్జీలపై నిర్ణయం తీసుకోబోమని ఈఆర్‌‌సీ చైర్మన్‌‌ శ్రీరంగరావు ప్రకటించారు. వారంలో టారిఫ్‌‌ను అందించాలని డిస్కంలను డిసెంబర్‌‌ 2న ఈఆర్సీ ఆదేశించింది. కానీ ఈఆర్‌‌సీ అధికారులు గురువారం సాయంత్రం వరకు వేచి చూసినా డిస్కంల నుంచి ప్రపోజల్స్‌‌ ఏమీ అందలేదు. దాంతో త్వరలో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని శ్రీరంగరావు చెప్పారు. గతంలోనూ ఏళ్లకు ఏళ్లు ఏఆర్‌‌ఆర్‌‌ ప్రకటించకుండా డిస్కంలు నిర్లక్ష్యం చేసినా ఈఆర్‌‌సీ చర్యలు తీసుకోలేదు. తాజాగా వారం గడువునూ డిస్కంలు బేఖాతరు చేశాయి.