టీఆర్ఎస్ కు ప్రజల మద్దతు ఉంది కాబట్టే సంపూర్ణ మెజారిటీతో రెండు ఎమ్మెల్సీలు గెలిచామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పటికైనా బీజేపీ- కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మానుకోవాలని సూచించారు. బీజేపీని ప్రజలు నమ్మలేదని.. అందుకే తెలంగాణ కౌన్సిల్ లో బీజేపీకి స్థానం లేకుండా చేశారని విమర్శించారు. తమ MLA లు, నాయకుల ఇళ్లపై దాడులు చేయించి లబ్ది పొందాలని చూసినా.. ప్రజలు బుద్ది చెప్పారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులని... త్వరలో వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎర్రబెల్లి.
