V6 News

మహిళలపై   మోదీది కపట ప్రేమ : ఎర్రబెల్లి స్వర్ణ

మహిళలపై   మోదీది కపట ప్రేమ :  ఎర్రబెల్లి స్వర్ణ
  • రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

హైదరాబాద్, వెలుగు: కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ మహిళలపై కపట ప్రేమ చూపిస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. సోమవారం ఆమె గాంధీ భవన్​లో మీడియా తో మాట్లాడారు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మహిళల నుంచి బీజేపీకి ముప్పు ఉందని గమనించిన మోదీ..ఈ నెల 16 న మహిళా బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల క్రితమే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టేందుకు  చర్చను ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.