ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

పద్మారావునగర్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్​ సనత్‌‌‌‌నగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. బన్సీలాల్‌‌‌‌పేట్ డివిజన్‌‌‌‌లోని సీసీ నగర్ 120, 121 బూత్‌‌‌‌లను ఆమె శనివారం సందర్శించారు.

డిప్యూటీ కమిషనర్ సుజాత, ఎన్నికల నమోదు అధికారి, బీఎల్ఏ అగస్టీన్, బూత్ స్థాయి అధికారి అరుణ, స్థానిక నాయకులతో కలిసి ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యానికి తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.