ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ కురగాయల తోట

ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ కురగాయల తోట

ఎవరి ఇంటికి కావాల్సిన కూరగాయలు వారు పండించుకునే రోజులు పోయాయి..గ్రామాల్లోనూ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ, మెదక్ జిల్లాలోని  ఒ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ కురగాయల తోట ఉంటుంది.వారికి సరిపోగా మిగిలినవి అమ్ముకుంటూ అదనపు ఆదయమూ పోందుతున్నారు. పచ్చదనంలోనూ  మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు అక్కడి ప్రజలు. ప్రతి ఇంటిముందు పచ్చని పందిరి, ఊరంతా చెట్లు, కూరగాయల తోటలు కనిపిస్తున్న ఈ గ్రామం మెదక్ జిల్లాలోని చంద్రుతండా. సేంద్రియ వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఈ తండాలో ఏ కార్యక్రమం చేపట్టాలన్న ముందుగా పెద్దలంతా సమావేశమవుతారు. ఇందులో తీర్మానం చేశాకే  కార్యక్రమం మొదలు పెడతారు. గ్రామంలో రోడ్లకు రెండువైపుల పూలు,పండ్ల మొక్కలను నాటారు. ప్రతి ఇంటిలో నాలుగైదు మొక్కలను నాటారు.ప్రభుత్వం ఇచ్చిన మొక్కలతో పాటు ప్రైవేటు నర్సరీల నుంచి  500 మొక్కలు తీసుకొచ్చి నాటారు. మొత్తం 3 వేల 250 మొక్కలు నాటి, ట్రీగార్డులు, కంచెలు ఏర్పాటు చేశారు. మొక్కలు పెరిగి పెద్ద చెట్లుగా మారాయి. దీంతో గ్రామమంతా పచ్చగా, అందంగా,ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. 

 
తండాలో  188 కుటుంబాలు, 140 ఇళ్లు ఉన్నాయి.  110 ఇంకుడు గుంతలు నిర్మించారు. ఇక్కడ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు పెద్దలు. ముందుగా దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి బియ్యం తీసుకెళ్లం వంటి  కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమకున్న భూమిలో అర ఎకరం కూరగాయలు పండిస్తుంటారు. కుటుంబ అవసరాలకు పోను మిగిలినవి టేక్మాల్ , పాపన్నపేట, నార్సింగి, జోగిపేట, ఎల్లుపేట, బొడ్మట్ పల్లి, వట్ పల్లి మార్కెట్లలో అమ్ముతూ  ఆదాయం పోందుతున్నారు. కూరగాయల సాగులో ఆదర్శంగా నిల్వడంతో  చంద్రు తండా పంచాయతీని ‘మన మెదక్ -మన కూరగాయలు-మన ఆరోగ్యం’కార్యక్రమం అమలుకు ఎంపిక చేశారు వ్యయసాయ శాఖ జిల్లా అధికారులు . కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలోని..   వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు అందించేలా ఎర్పాట్లు చెశారు. కూరగాయల సాగు,మొక్కల పెంపకం,గ్రామ పరిశుభ్రత,ఇంకుడు గుంతలతో  జిల్లాలో ఉత్తమ పంచాయతీగా నిలిచింది ఈ గిరిజన గ్రామం. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుతో ఆదాయంతో ఆరోగ్యంగా ఉన్నామంటున్నారు చంద్రుతండా వాసులు.