ఇక ప్రతి నెలా ఈ-వేస్టేజీ డ్రైవ్.. వ్యర్థాలను దుండిగల్ ప్రాసెసింగ్ యూనిట్ కు తరలింపు

ఇక ప్రతి నెలా  ఈ-వేస్టేజీ డ్రైవ్.. వ్యర్థాలను దుండిగల్ ప్రాసెసింగ్ యూనిట్ కు తరలింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఇక నుంచి ప్రతి నెలా రెండు రోజుల పాటు ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్‌ నిర్వహిస్తామని జీహెచ్​ఎంసీ కమిషనర్​ఆర్వీ కర్ణన్​స్పష్టం చేశారు. నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఈ -వేస్ట్ సానిటేషన్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. ఈ డ్రైవ్‌లో 88 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు.

 ఈ వ్యర్థాలను దుండిగల్‌లోని ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించారు. సోమవారం 271 లొకేషన్లలో 95 ప్రత్యేక వాహనాల ద్వారా 47 మెట్రిక్ టన్నులు, మంగళవారం 260 లొకేషన్లలో 96 వాహనాల ద్వారా 41 మెట్రిక్ టన్నులను సేకరించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ స్పెషల్​డ్రైవ్​సక్సెస్​కావడంతో, ఇక నుంచి ప్రతి నెలా రెండు రోజుల పాటు ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు.