ఇరాన్-అమెరికా యుద్ధం: దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లను రెండు రోజులు మూసివేసిన యుఎఇ..

ఇరాన్-అమెరికా యుద్ధం: దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లను రెండు రోజులు మూసివేసిన యుఎఇ..

ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాల ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయాలు తీసుకుంది.  ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారుల భద్రత దృశ్య  దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లను రెండు రోజుల పాటు అంటే మార్చి 2, 3 తేదీల్లో మూసేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ఉద్రిక్తతలు.. భద్రతా కారణల దృష్ట్యా యూఏఈ, ఖతార్ వంటి దేశాలు  విమాన మార్గాలను మూసివేసాయి. దీనివల్ల విమాన ప్రయాణాలు రద్దయి వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
 
ఈ యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $82.37కు చేరింది. 2025 జనవరి తర్వాత నమోదైన అత్యధిక ధర. ఇక బంగారం  ధరలు కూడా ఒక్కసారిగా 1.75 శాతం పెరిగి, గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
 
అమెరికా నేతృత్వంలోని భద్రత దళాల దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్ కొత్త నాయకత్వం తనతో చర్చలు జరపాలని కోరుకుంటోందని, తాను అందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్ ఇప్పటికే క్షిపణి దాడులకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిణామాలను చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో  3వ ప్రపంచ యుద్ధం మొదలైందని  కామెంట్స్ చేస్తున్నారు.