దిల్ సుఖ్ నగర్, వెలుగు: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై కొందరు పాత నేరస్తులు కత్తులు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన గత శనివారం రాత్రి సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్మన్ ఘాట్ బైరామల్ గూడలో అర్బన్ రెస్టారెంట్ ఉంది. గత శనివారం పాతనేరస్తులైన ఏదుల ప్రసన్న కుమార్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి నలుగురు స్నేహితులతో కలిసి అర్బన్ రెస్టారెంట్ కు వచ్చి ఫుడ్ ఆర్డర్ చేశారు. తర్వాత బిల్లు చేతికి ఇవ్వగా..‘మమ్మల్నే బిల్లు అడుగుతావ్రా’ అంటూ రెస్టారెంట్ సిబ్బందిపై రెచ్చిపోయారు.
టేబుల్దగ్గరే దాడి చేయగా భయపడి పారిపోగా వెంబడించారు. చివరికి కిచెన్‌లోకి వెళ్తే అక్కడికీ వెళ్లి అక్కడి వస్తువులన్నీ చిందర వందర చేశారు. కత్తులతో తీవ్రంగా గాయపర్చారు. చేతికి దొరికిన వస్తువులతో కొట్టారు. ఒకరిని డెకరేషన్స్టాండ్తో తల పగలగొట్టారు. దీంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
కలెక్టర్ అంకుల్.. డీజీపీ తాత
కాగా, ఘటన జరిగి ఐదు రోజులు అయినా నిందితులు పాత నేరస్తులు కావడం, పెద్ద పెద్ద అధికారులు, పొలిటీషియన్స్‌తో సంబంధాలు ఉండడంతో భయపడ్డ రెస్టారెంట్ఓనర్లు, సిబ్బంది విషయాన్ని బయటకు చెప్పలేదు. పైగా నిందితులు తమ ఫేస్బుక్అకౌంట్లలో రంగారెడ్డి జిల్లాలో పని చేసిన ఓ కలెక్టర్‌తో కలిసి ఉన్న ఫొటోను పెట్టి తమకు అంకుల్అవుతాడని రాశారు. అలాగే, మాజీ డీజీపీతో కలిసి ఉన్న ఫొటోను పెట్టి హ్యాప్పీ బర్త్‌డే ‘డీజీపీ తాత’ అని మెన్షన్చేశారు. అలాగే, ‘ఐ డోంట్వాంట్వెపన్ఐయామ్ద వెపన్’ అని బెదిరించే రీతిలో పోస్టులు పెట్టుకున్నారు.
ఇదంతా తెలిసిన రెస్టారెంట్సిబ్బంది కేసు పెట్టలేదు. అయితే, అనూహ్యంగా బుధవారం దాడి చేస్తున్న పలు వీడియోలు బయటకు రావడంతో బాధితులు కంప్లయింట్ఇవ్వడం.. పోలీసులు కేసు నమోదు చేయడం చకచక జరిగిపోయాయి. ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు వంశీధర్‌రెడ్డి, ఆదిత్య చౌహాన్, సూర్యా అలియాస్టింకూతో పాటు మరొకరిపై కేసు నమోదు చేశామని సరూర్ నగర్ ఎస్సై మారయ్య తెలిపారు.
రెస్టారెంట్ సిబ్బందిపై రివర్స్ కేసు
కాగా, తమను తిట్టారని నిందితులు కూడా రెస్టారెంట్సిబ్బందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అలాగే, వారిపై కేసు వాపస్తీసుకోవాలని పై నుంచి ఒత్తిడి చేయిస్తున్నట్టు సమాచారం. దాడి ఘటనలో గాయపడిన వ్యక్తితో పాటు మరికొందరు తమను నిందితులు ఏం చేస్తారోనని భయపడుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ఇన్ఫ్లూయన్స్ఉన్నవారు కావడంతో తమకు ప్రాణ భయం ఉందని, కావాలంటే కేసు వాపస్తీసుకోవడానికి సిద్ధపడినట్టు సమాచారం.
బావ హత్య కేసులో నిందితులు
ప్రసన్న కుమార్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి స్వయాన అన్నదమ్ములు. వీరిద్దరూ వనస్థలిపురంలో సొంత బావ లలిత్ ఆదిత్యను హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. తమ సోదరిని వేధిస్తున్నాడని.. వనస్థలిపురంలోని సచివాలయ నగర్‌లోని లలిత్ ఇంట్లో కత్తులు పొడిచి ఇనుప రాడ్లతో దాడి చేశారు. పూలకుండీలతో తలపై కొట్టి చంపేశారు. 24 గంటల్లోనే వీరిని పట్టుకోగా, ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. తమకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.
