టీఆర్ఎస్ జనం ఛీకొట్టే స్థాయికి దిగజారింది

టీఆర్ఎస్ జనం ఛీకొట్టే స్థాయికి దిగజారింది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి గంగుల ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని క్యాంపులు పెట్టినా.. తనకు TRS నుంచి ఓట్లొచ్చాయన్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. TRS కు చెందిన 998 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను.. కుటుంబాలతో క్యాంపులకు తీసుకెళ్లారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను, MPTCలను..... గోవా, హైదరాబాద్ తరలించి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ లెక్కల ప్రకారం ఎల్ రమణకు 499 ఓట్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు రవీందర్ సింగ్. గంగుల ఎల్ రమణను ఒడగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. రమణ గెలిస్తే తన మంత్రి పదవి పోతుందేమోనని గంగలకు భయం పట్టుకుందన్నారు. గంగుల కమలాకర్.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లతో ఏం మాట్లాడారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. మంత్రి గంగుల హంగామా చేసిన పోలింగ్ బూత్ లోనే తనకు 70 ఓట్లు పడ్డాయన్నారు. టీఆర్ఎస్ జనం ఛీకొట్టే స్థాయికి దిగజారిందన్నారు రవిందర్ సింగ్.