బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అని రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడే దావూద్ గ్యాంగ్‌నుంచి బెదిరింపులు రావటంతో మరింత కుంగిపోయాడని వివరించారు. బెదిరింపులు తట్టుకోలేక సుశాంత్ 50వరకు సిమ్‌కార్డులు మార్చాడని పేర్కొన్నారు. సుశాంత్ మరణానికి ఒకరోజు ముందు ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకుండాపోయాని గుర్తుచేశారు. సుశాంత్ హత్యవెనుక ఆయన ఇంట్లో పనివాళ్లతోపాటు అతని సన్నిహిత మిత్రులు కూడా ఉన్నారని ఎన్ కే సూద్ అన్నారు.
