కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌పై తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్ర, సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కేవలం స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే ప్రయత్నమేనని.. టీఎంసీ 200కు పైగా సీట్లు గెలిచి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి టీఎంసీ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడొద్దని ధైర్యం చెప్పారు. శనివారం (మే 2) వర్చువల్‌గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దీదీ ప్రసంగిస్తూ.. టీఎంసీ విజయం కోసం క్షేత్రస్థాయిలో అవిశ్రాంతగా పోరాటం చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే ప్రయత్నమని కొట్టి పారేసిన దీదీ.. టీఎంసీ 200కు పైగా సీట్లు గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ ప్రవర్తనను ప్రభావితం చేయడానికి బీజేపీ ఎగ్జిట్ పోల్స్‌ను ఒక సాధనంగా వాడుతుందని విమర్శించారు. 2021, 2024 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే చేశారని గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు.
బెంగాల్ ఎన్డీఏదేనన్న ఎగ్జిట్ పోల్స్
దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్వల్ప మెజార్టీతో అధికారం చేజిక్కించుకోవచ్చని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఎన్డీఏ కూటమి 150 నుంచి 160 స్థానాలను సాధించి అధికార పీఠానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 130 నుంచి 140 స్థానాల్లో దక్కించుకోవచ్చని పలు సర్వేలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీఎంసీ కొట్టిపారేస్తోంది.
►ALSO READ | టీవీకే 180 నుంచి 200 సీట్లు గెలుస్తది.. విజయ్ CM అవ్వడం పక్కా: కేఏ సెంగోట్టయ్యన్
