ఫేస్​బుక్​ డేటా మళ్లీ లీక్

ఫేస్​బుక్​ డేటా మళ్లీ లీక్

ఫేస్​బుక్​ డేటా మరోసారి లీకైంది. 26.7 కోట్ల మంది యూజర్ల వివరాలు డార్క్​వెబ్​లోకి వచ్చాయి. ఇందులో యూజర్ల ఐడీలు, పేర్లు, ఫోన్​ నంబర్లు కూడా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇందులో ఎక్కువగా అమెరికా యూజర్ల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంపారిటెక్, సైబర్​సెక్యూరిటీ రీసెర్చర్ ​బాబ్​ డియాచెంకో విడుదల చేసిన రిపోర్టులో ఈ మేరకు వెల్లడైంది. వియత్నాంలోని సైబర్​క్రిమినల్స్​ఈ పని చేసినట్టు డియాచెంకో తెలిపారు. అయితే డేటాను ఎలా దొంగిలించారనేది క్లియర్​గా తెలియనప్పటికీ ‘‘స్ర్కాపింగ్​” ద్వారా లేదా ఫేస్​బుక్​డెవలపర్​‘‘ఏపీఐ’’ నుంచి డైరెక్టుగా దోపిడీ చేసి ఉంటారని పేర్కొన్నారు.

యూజర్ల వివరాలు రెండు వారాల పాటు డార్క్​వెబ్​లో అందుబాటులో ఉన్నాయని, దీనికి సంబంధించిన లింక్​ను పాపులర్​హ్యాకర్​ఫోరమ్​లో పోస్ట్​చేశారని ఆయన గుర్తించారు. డిసెంబర్​4న హ్యాకర్లు డేటాను ఆన్​లైన్​లో పోస్ట్​చేశారు. 12న హ్యాకర్ల ఫోరమ్​లో పెట్టారు. దీన్ని అనలిస్టు గుర్తించి ఇంటర్నెట్​సర్వీస్​ ప్రొవైడర్​కు రిపోర్టు పంపగా, ఐపీ అడ్రస్​సహాయంతో19న రిమూవ్​చేశారు. ఈ డేటాతో సైబర్​ క్రిమినల్స్ ​స్విమ్ ​స్వాపింగ్, స్వామ్​ కాల్స్​కు పాల్పడుతారని డియాచెంకో హెచ్చరించారు. ‘‘ఈ సమస్యపై మేం దృష్టిసారించాం. యూజర్ల వివరాలను ప్రొటెక్ట్​చేసేందుకు చర్యలు తీసుకున్నాం. హ్యాకర్లు దొంగలించిన డేటా పాతది” అని ఫేస్​బుక్​ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్​లో 40 కోట్లకు పైగా యూజర్ల ఫోన్​ నంబర్లు ఆన్​లైన్​లోకి వచ్చిన సంగతి తెలిసిందే.