ఫేక్ బుక్లో  ఫేక్ మూవీ యాప్ మోసం..  ఫ్రీగా సినిమా చూసిండు..లక్షలు పోగొట్టుకున్నడు.. 

ఫేక్ బుక్లో  ఫేక్ మూవీ యాప్ మోసం..  ఫ్రీగా సినిమా చూసిండు..లక్షలు పోగొట్టుకున్నడు.. 
  • రూ. 1.75 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్‌‌ బుక్‌‌ బ్రౌజ్ చేస్తుండగా, ఫ్రీ మూవీ పేరిట వచ్చిన ఓ యాడ్​నగరానికి చెందిన వ్యక్తి ఖాతాను ఖాళీ చేసింది. ఫ్రీగా కొత్త సినిమా చూపించిన సైబర్​క్రిమినల్స్​రూ. 1.75 లక్షలు కొట్టేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం కమిషనర్ టి. సాయి మనోహర్ కథనం ప్రకారం.. సిటీకి చెందిన ఒకరు మొబైల్​లో  ఫేస్ బుక్ బ్రౌజ్ చేస్తున్నాడు.

‘లేటేస్ట్ మూసీవ్ ఫ్రీగా చూడండి.. ఇప్పుడే యాప్ డౌన్​లోడ్​ చేసుకోండి’ అని కనిపించింది. దీంతో అతడు లింక్‌‌పై క్లిక్ చేయగా..gdpr.tubi.tv అనే వెబ్‌‌సైట్‌‌కు తీసుకెళ్లింది. ట్యూబీ.టీవీ అనేది ఒక ఉచిత వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌‌ఫారమ్. అసలైన ట్యూబీ.టీవీలా కనిపించడంతో అక్కడి నుంచి  యాప్‌‌ డౌన్​లోడ్‌‌ చేసుకున్నాడు. ఓపెన్ చేసి సినిమా చూసిన తర్వాత, కొంతసేపటికి ఫోన్‌‌లో సాఫ్ట్‌‌వేర్ ఆటోమేటిక్‌‌గా అప్‌‌డేట్ అవుతున్నట్లు కనిపించింది. దీన్ని సాధారణ అప్​డేట్​గా భావించాడు.

కొద్దిసేపటికి మొబైల్ హాంగ్​అయ్యింది. కొద్దిసేపటికి యూపీఐ పనిచేయకపోవడం, ఇతర యాప్‌‌లు ఓపెన్ కాకపోవడంతో అనుమానం వచ్చి బ్యాంక్ అకౌంట్​డిటెయిల్స్​చెక్​చేశాడు. అందులో నుంచి రూ. 80 వేలు, అదే ఫోన్‌‌లో నిర్వహిస్తున్న తన తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 95 వేలు డెబిట్ అయినట్లు కనిపించింది. 

 ఎలా మోసపోయాడంటే.. 

బాధితుడు డౌన్‌‌లోడ్ చేసిన యాప్ అసలు Tubi TV కాదు.  అదే పేరుతో రూపొందించిన ఓ మాల్​వేర్​అప్లికేషన్​అని సైబర్ క్రైం కమిషనర్ సాయి మనోహర్ చెప్పారు. ఈ మాల్​వేర్​తో  బాధితుడికి తెలియకుండానే ఫోన్ ను సైబర్ నేరస్తులు వారి ఆధీనంలోకి తీసుకున్నారని, ఎస్‌‌ఎంస్‌‌లు, ఓటీపీలను చదివి బ్యాంకింగ్ యాప్‌‌లకు అనధికారికంగా యాక్సెస్ తీసుకుని డబ్బులు కొట్టేశారని చెప్పారు.

సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ఏపీకే ఫైళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.  అనుమానాస్పద యాప్‌‌లకు పర్మిషన్స్ ఇవ్వొద్దని, ఫేక్ సాఫ్ట్ వేర్ అప్‌‌డేట్ నోటిఫికేషన్లను క్లిక్ చేయొద్దన్నారు.  మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌‌డేట్స్‌‌ను అధికారిక ఫోన్ సెట్టింగ్స్ ద్వారానే చేయాలని కోరారు.  

మోసానికి గురైతే ఏం చేయాలి..

మోసానికి గురైతే ఇంటర్నెట్ కనెక్షన్‌‌ను నిలిపివేసి, అనుమానాస్పద యాప్‌‌లను తొలగించాలి .. బ్యాంక్ పాస్‌‌వర్డ్స్, యూపీఐ పిన్ ఇతర లాగిన్ వివరాలు మార్చాలి. బ్యాంక్‌‌ను సంప్రదించి విషయం తెలియజేయాలి.  1930 - సైబర్ క్రైమ్ హెల్ప్‌‌లైన్‌‌కు కాల్ చేయడమో లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి.