ఖమ్మం టౌన్, వెలుగు: బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బక్రీద్ (ఈద్-ఉల్-అధా)ను శాంతియుతంగా జరుపుకునేందుకు ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, ఖురేషీ ప్రతినిధులతో పోలీస్ యంత్రాంగం సమన్వయ సమావేశం పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ గోవధ చేయవద్దని, కేవలం అనుమతించిన జంతువులను మాత్రమే, నిబంధనలకు లోబడి బలి ఇవ్వాలని సూచించారు. అక్రమ పశువుల రవాణాను అరికట్టడానికి అంతర్-రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే సంబంధిత పోలీసులకు, కమాండ్ కంట్రోల్ సెల్ నెంబర్ 87126 59111 కు సమాచారం అందించాలని
సూచించారు.
