భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( జూన్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో జరిగింది ఈ ప్రమాదం.
మృతి చెందినవారిలో ఓ మహిళ, యువకుడు, బాలుడు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
