భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణలో రైల్వే, నేషనల్ హైవేలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని బీజేపీ జిల్లా ఆఫీస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
ఈ నెల 10న సికింద్రాబాద్లో జరగనున్న ప్రధాని మోదీ పర్యటనను ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జీవీ మనోహర్ పాల్గొన్నారు.
