మహిళా పాల డెయిరీ కార్యకలాపాలపై సమీక్ష

మహిళా పాల డెయిరీ కార్యకలాపాలపై సమీక్ష

హనుమకోండ సిటీ, వెలుగు: పరకాల మహిళా డెయిరీ కార్యకలాపాలు సాగేవిధంగా చర్యలు చేపట్టాలని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం పరకాల డెయిరీ కార్యకలాపాలపై హనుమకొండ కలెక్టరేట్ లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్​, సత్య శారద, డీఆర్డీఏ అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన అంశాలు, బీఎంసీయూల ద్వారా పాల సేకరణ, పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్, హెచ్ఆర్ సిబ్బంది నియామకం, తదితర అంశాలపై అధికారులతో ప్రస్తావించారు.