- కేంద్ర ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీ బల్దేవ్ పురుషార్థ
జనగామ, వెలుగు: నేల, వాతావరణం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రెటరీ, పీఎం డీడీకేవై నోడల్ ఆఫీసర్ బల్దేవ్ పురుషార్థ సూచించారు.
జనగామ కలెక్టరేట్లో పీఎం ధన్-ధాన్య కృషి యోజన(పీఎం డీడీకేవై) స్కీంపై నిర్వహించిన మీటింగ్‌లో వ్యవసాయం, అనుబంధరంగాలు, రైతులకు రుణాలు, నీటి వనరులు, పంటల విధానం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాల అనుసంధానం తదితర అంశాలపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి రివ్యూ చేశారు. ముందుగా కలెక్టర్ పలు అంశాలను ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా బల్దేవ్ పురుషార్థ మాట్లాడుతూ పీఎం డీడీకేవై స్కీమ్‌ను సక్సెస్ చేయడానికి సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆరేండ్లలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి, వాతావరణం, నేల లక్షణాలు ఉంటాయని, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి అందుకు అనుగుణంగా పంటలు పండించాలని సూచించారు. ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రూపొందించిన ‘తెలంగాణ అగ్రికల్చర్ ఎమర్జెన్సీ అండ్ ఆల్టర్నేటివ్ యాక్షన్ ప్లాన్ - వర్షాకాలం 2026’ బుక్‌ను ఆయన పరిశీలించి అభినందించారు.
రివ్యూలో డీఏవో అంబికా సోనీ, డీఆర్డీవో భాస్కర్, సీపీవో చిన కోట్యానాయక్, ఏపీడీ నూరుద్దీన్, డీవీహెచ్‌వో మురళీధర్ రావు, మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమ్య ఉన్నారు.
