బలమైన గాలులతోనే భారీ వృక్షాలు నేలకూలినయ్.. ములుగు జిల్లా ఫారెస్ట్ ఏరియాలో ఘటన

బలమైన గాలులతోనే భారీ వృక్షాలు నేలకూలినయ్.. ములుగు జిల్లా ఫారెస్ట్ ఏరియాలో ఘటన

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం నేలకొరిగిన వృక్షాలను మంగళవారం చీఫ్  కన్జర్వేటర్  ఆఫ్  ఫారెస్ట్  ప్రభాకర్, డివిజనల్  ఫారెస్ట్  ఆఫీసర్  వికాస్  మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్  మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూమి సారవంతంగా ఉంటుందని, లూజ్  సాయిల్ లో తల్లి వేరు వ్యవస్థ భూమిలోకి చొచ్చుకుపోకపోవడంతో బలమైన గాలులు రావడంతో చెట్లు నేలకూలాయని తెలిపారు. 

కూలిపోయిన చెట్లలో విలువైన వాటిని వెంటనే డిపోకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంటన ఎఫ్​డీవో వజ్రా రెడ్డి, ఇన్​చార్జి ఎఫ్ఆర్వో లాయక్  హుస్సేన్, మంగపేట సౌత్  బీట్  ఆఫీసర్  మోడెం పుణ్యవతి, నార్త్  బీట్  ఆఫీసర్  దుడ్డు ప్రవీణ్, బేస్  క్యాంప్  సిబ్బంది పాల్గొన్నారు