భద్రాచలం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్అంకిత్ ఆదేశించారు. చర్ల మండలం సత్యనారాయణపురంలో మంగళవారం ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. పెద్దపల్లి-ముమ్మడివరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, హౌసింగ్ ఏఈ ముకేశ్, ఏవో లావణ్య తదితరులున్నారు.
