జనగామ అర్బన్, వెలుగు : పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, సాదాబైనామా పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై సమీక్షించి, పలు సూచనలు చేశారు. సమీక్షలో ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు.
