
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లో నకి లీ ఉద్యోగుల బెడద కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండు వారా ల వ్యవధిలో ఇద్దరు నకిలీ ఉద్యోగుల్ని అరెస్టు చేయగా, తాజాగా మరో నకిలీ ఐఏఎస్ పట్టుబడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు.
అతనికి రెగ్యులర్ ఉద్యోగులు కూడా సహకరించారు. ఒక్కో బాధితుడి నుంచి ఒక్కో ఉద్యోగానికి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశా డు. అలా ఏడుగురు బాధితులు నింది తుడి ని నమ్మి డబ్బులు ఇచారు. చివరకు మోసపోయామని తెలుసుకుని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.