నిరుద్యోగులకు గుడ్ న్యూస్: తెలంగాణ అగ్రికల్చర్ యూనిర్సిటీలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్ !

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్: తెలంగాణ అగ్రికల్చర్ యూనిర్సిటీలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్ !

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) టీచింగ్ అసోసియేట్/పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

పోస్టు పేరు: టీచింగ్ అసోసియేట్/పార్ట్ టైం టీచర్,

మొత్తం ఖాళీలు: 12.

విభాగాల వారీగా ఖాళీలు: అపెరల్ & టెక్స్ టైల్ 3, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ మేనేజ్ మెంట్ 3. అగ్రికల్చరల్ ఎకనామిక్స్ 1. హ్యుమన్ డెవలప్ మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ 1, రీసోర్స్ మేనేజ్ మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్స్ 3. అగ్రోనమీ 1.

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ హోమ్ సైన్స్, ఎంఎస్సీ అగ్రి, ఎకనామిక్స్ లేదా ఎంఎస్సీ అగ్రిస్టాటి స్టిక్స్ పూర్తిచేసి ఉండాలి. వీటితోపాటు పీహెచ్ఎ లేదా నెట్ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జులై 6, 7,

సెలెక్షన్ ప్రాసెస్: వాక్ఇన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్సైట్ pitau.edu.inను సందర్శించండి.