జులై 16 నుంచి గోల్కొండ జగదాంబిక బోనాలు షురూ..

జులై 16 నుంచి గోల్కొండ జగదాంబిక బోనాలు షురూ..

బోనాల ఉత్సవాలు జులై16వ తేదీ నుంచి గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో పూజలతో ఈ చారిత్రాత్మక తెలంగాణ రాష్ట్ర పండుగ వైభవంగా ప్రారంభం కానుంది. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, లాల్‌‌‌‌‌‌‌‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న, మాదన్న మహంకాళి దేవాలయాల్లో కొనసాగుతాయి. ఈ పండుగ ఆగస్టు నెల మధ్య వరకు ఎంతో కోలాహలంగా జరగనుంది. 

బోనాల సందర్భంగా మహిళలు భక్తి ప్రపత్తులతో పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండల్లో అన్నం, బెల్లం, పెరుగు నైవేద్యంగా సమర్పిస్తూ తలపై మోసుకుని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుంటారు. డప్పుల మోతలు, కోలాటాలు, జానపద కళారూపాలు, రంగురంగుల తొట్టెలు, ఘటం ఊరేగింపులు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

బోనాలంటే విశిష్ఠ ఆకర్షణ పోతురాజుల డాన్సులు, రంగం కార్యక్రమంలో అమ్మవారి ఆవాహన పొందిన మహిళ భవిష్యవాణి భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఇలా.. జులై నెల వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, సంస్కృతి.. ప్రతి రంగంలోనూ జరిగే ఈవెంట్లు నగరవాసుల రోజువారీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది.