బంజారాహిల్స్ లో నకిలీ ఇన్స్పెక్టర్ అరెస్ట్ 

బంజారాహిల్స్ లో నకిలీ ఇన్స్పెక్టర్ అరెస్ట్ 

హైదరాబాద్ బంజారాహిల్స్ లో నకిలీ ఇన్స్పెక్టర్ గుట్టురట్టయింది. ఖమ్మం సీఐ పేరుతో ఓ డాక్టర్ కు ఫోన్ చేసి 75 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు బాధిత డాక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కా ప్లాన్ తో మాటు వేసి నకిలీ ఇన్స్పెక్టర్ ను పట్టుకున్నారు . గతంలో డాక్టర్ ఇంట్లో మహేష్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే డాక్టర్ కు సంబంధించిన కాల్ రికార్డుంగ్ లను మహేష్ తెలివిగా తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న డాక్టర్ మహేష్ ను విధుల్లో నుంచి తొలగించాడు. దీంతో నకిలీ ఇన్స్పెక్టర్ అవతారమెత్తి 75 లక్షలు ఇవ్వాలని  లేదంటే ..ఆడియో రికార్డింగ్ లను బయటపెడతా అంటూ బెదిరింపులకు దిగాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.