హయత్ నగర్లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

హయత్ నగర్లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

హైదరాబాద్ : హయత్ నగర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లులోని పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ప్రాంతాల్లో నకిలీ మద్యం డంపుల కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో కోటి రూపాయల పైగా విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ నకిలీ మద్యం.. దేవలమ్మ నాగారంకు చెందిన ఓ బడా వ్యాపారికి చెందిన డంప్‌గా అధికారులు గుర్తించారు. మరోవైపు హయత్ నగర్ శివారులోని ఓ బెల్టుషాపులో నకిలీ మద్యాన్ని విక్రహిస్తున్న షాప్ నిర్వాహకుడిని విచారించగా.. నకిలీ మద్యం గుట్టు రట్టు చేశాడు. దానిపై కూడా అధికారులు దాడులు చేశారు. ఈ నకిలీ మద్యంపై హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులను ప్రశ్నించగా.. నోరు మెదపడం లేదని తెలుస్తోంది.