బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా అంటూ ఫేక్ వార్తలు

బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా అంటూ ఫేక్ వార్తలు

బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు షికారు చేస్తున్నాయి. గంగూలీ బీసీసీఐ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని..అతని ప్లేస్ లో  సెక్రటరీ జైషా ప్రెసిడెం‌ట్‌గా బాధ్యతలు చేపట్టాడని బీసీసీఐ పేరిట ఉన్న ఓ ఫేక్ ట్విటర్ అకౌంట్ పేర్కొంది. ఈ వార్తలను నమ్మిన కొన్ని వార్తా ఛానళ్లు.. ప్రచారం చేశాయి. చివరకు సెక్రటరీ జై షా వచ్చి వివరణ ఇచ్చేంతవరకు ఆ వార్తల ప్రసారం ఆగలేదు.

బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి గంగూలీ రాజీనామా చేశాడంటూ వచ్చిన వార్తలతో అభిమానులు అయోమయానికి గురయ్యారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.  వార్తలు ప్రసారం చేసే సమయంలో నిజా నిజాలు తెలుసుకోరా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గంగూలీ రాజానామా చేశాడంటూ ఫేక్ న్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో  గంగూలీ చేసిన ఓ ట్వీట్ ను  తప్పుగా అర్థం చేసుకున్న న్యూస్ ఛానెళ్లు.. రాజీనామా చేశాడంటూ వార్తలను ప్రసారం చేశాయి.