సివిల్స్ సెలెక్ట్ కాలేదని నకిలీ IPS అవతారమెత్తాడు

సివిల్స్ సెలెక్ట్ కాలేదని నకిలీ IPS అవతారమెత్తాడు

నకిలీ పోలీస్ ఆఫీసర్ గా చలామణీ అవుతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటి గురువినోద్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ అంటూ కొంతకాలంగా అందరినీ బురిడీ కొట్టిస్తున్నాడని.. అతన్ని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు.

సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ. ‘ గురువినోద్ కుమార్ రెడ్డిది కడప జిల్లా. గురువినోద్ కుమార్  తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తండ్రి లాగే యూనిఫామ్ వేసుకోవాలని… పోలీస్ జాబ్ చేయాలని అతడి డ్రీమ్. సివిల్స్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్స్ రాశాడు. కానీ సక్సెస్ కాకపోవడంతో స్నేహితుల ముందు అందరి ముందు పరువు పోతుందనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్ ఎయిర్  ఫోర్స్ ఫ్లెయింగ్ ఆఫీసర్ అంటూ అందరినీ నమ్మించాడు. పోలీసులకు దొరికిపోయి జైలుకెళ్లాడు. ఇటీవల  జైలు నుంచి వచ్చిన శ్రీనివాస్ మళ్లీ  హైదరాబాద్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నాడు.  కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ అయిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తో పరిచయం పెంచుకుని నకిలీ ఐడీ కార్డులు క్రియేట్ చేసి అందరికీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నాడు.  శ్రీనివాస్ నుంచి నకిలీ పిస్తల్,  6 సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్ ,పోలీస్ డ్రెస్ స్వాధీనం చేసుకున్నాం‘ అని చెప్పారు .